Showing posts with label google my activity telugu. Show all posts
Showing posts with label google my activity telugu. Show all posts

గూగుల్లో మీ యొక్క వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ ఏదీ ఉండకూడదు అంటే ఇలా చెయ్యండి!

How to Delete Google Search History in Telugu

Tips and Tricks Telugu

google history delete all my activity telugu, how to clear google history in telugu, how to delete google search history in telugu, mygoogleactivity, delete google my activity telugu, delete my activity telugu , tips and tricks in telugu, telugu tips, tech tips in telugu, technology tips in telugu, telugu tech tips, technology telugu, telugu tech
how to clear google history in telugu

Technology Tips in Telugu:

చలికాలం వస్తుంది కదా!అందుకని చలికోటు కొందామనుకున్నాడు సుబ్బారావు గారు. రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం అని గూగుల్లో(google) వెతికాడు.

ఆ తరువాత నుంచి సుబ్బారావు ఎప్పుడు గూగుల్ బ్రౌజర్(browser) ఓపెన్(open) చేసినా.. ఏ వెబ్సైట్(website) ఓపెన్ చేసి చుసిన వివిధ రకాల చలికోట్లు మరియు వాటి ధరలకు సంబంధించిన ప్రకటనలు(ads) బ్రౌజ్ లో తెరపై కనిపిస్తున్నాయి.

ఈ అనుభవం మీకు కూడా కలిగే ఉంటుంది కదూ! నాకైతే చాలా సార్లు ఎదురైంది.

మరి ఇదెలా సాధ్యం? మనం సెర్చ్(search) చేసిన హిస్టరీ(history) ఇన్ఫర్మేషన్(information) వారికెలా తెలుస్తోంది? ఎక్కువ ఆలోచన చేయొద్దు నే చెప్తా గా..

అలా మనం సెర్చ్(search history) చేసిన సమాచారం ఇతరులకు తెలియకుండా ఉండాలంటే ఏం చేయాలి? పదండి ఆ వివరాలను తెలుసుకుందాం.

వ్యక్తిగత గోప్యత

"మీరు గూగుల్(google) సేవలను ఉపయోగిస్తున్నారా? అయితే, మీ డేటా(data) చాలా సురక్షితం(safety) మరియు గోప్యంగా(secure) ఉంది. మీరు దీన్ని విశ్వసించవచ్చు."

గూగుల్ ప్రైవసీ యొక్క నియమ, నిబంధనల్లో సాధారణంగా మీరు చూసే మొట్ట మొదటి వాక్యం ఇది.

అయితే మీకు ఒక విషయం తెలియక పోవచ్చు. అదే గూగుల్ "మై యాక్టివిటీ"(google my activity).

గూగుల్లో మీరు సెర్చ్ చేసే ప్రతి పనీ ఇందులో రికార్డవుతుంది.

దీని ఆధారంగానే మీ మరియు నా బ్రౌజింగ్ చరిత్రను(browsing history) ఆయా సంస్థలు క్లియర్ గా తెలుసుకుంటున్నాయి.

వాటికీ సంబంధించిన యాడ్స్(advertisements) ఇస్తుంటాయి.

మీరు అడిగే తదుపరి ప్రశ్న ఎలా తొలగించాలి?

ఈ రోజుల్లో ఆన్లైన్(online) ప్రపంచంలో విహరించే అందరికి జి-మెయిల్(gmail) ఎకౌంటు అనేది కచ్చితంగా ఉంటుంది. అంటే మీకు గూగుల్లో(google) ఒక ఖాతా(account) ఉందన్నమాట.

గూగుల్ సెర్చ్ ఇంజిన్ తో(search engine) ఈ ఖాతా ఎప్పుడూ అనుసంధానమై(link) ఉంటుంది.

మనం గూగుల్లో ఏం వెతికినా, ఏం చేసినా ప్రతి విషయం రికార్డు అవుతుంది.

మనం ఏ ప్రాంతంలో ఉన్నా.. కంప్యూటర్/ లాప్టాప్ ఏదైనా.. మనం వెతికినా ప్రతి విషయం "మై యాక్టివిటీ" (my activity) అనేది సేకరిచేస్తుంది.

ఈ డేటాను తొలగించాలంటే మై ఆక్టివిటీ ను తెరవండి.

google history delete all my activity telugu, how to clear google history in telugu, how to delete google search history in telugu, mygoogleactivity, delete google my activity telugu, delete my activity telugu , tips and tricks in telugu, telugu tips, tech tips in telugu, technology tips in telugu, telugu tech tips, technology telugu, telugu tech
my google activity

మై యాక్టివిటీ(my activity) లింక్పై క్లిక్ చేయగానే "గూగుల్ లో మై యాక్టివిటీ" అనే వేరే విండో ఓపెన్ అవుతుంది.

ఈ విండో పై భాగంలో ఒక సెర్చ్ బాక్స్ కనిపిస్తుంది.

దీని ద్వారా మీరు వెతికిన వెబ్సైట్ల(website) వివరాలను(information) అన్నీ తెలుసుకోవచ్చు. వాటిని డిలీట్ కూడా చేయొచ్చు.

లేదా తేదీల వారీగా కూడా బ్రౌజింగ్ హిస్టరీని(browsing history) తొలగించవచ్చు(delete).

లేదా మొత్తం సమాచారాన్ని ఒకేసారి డిలీట్(delete) చేసే ఏర్పాటు కూడా ఇందులో ఉంటుంది.

ఈ సమాచారాన్ని తొలగించడం(remove) వల్ల కలిగే పరిణామాల గురించి గూగుల్ మిమ్మల్ని హెచ్చరిస్తుంది..

బ్రౌజింగ్ హిస్టరీని డిలీట్(delete google browsing history) చేయడం వల్ల పెద్ద నష్టమేమీ ఉండదు. ఇది మీ Google ఖాతా మరియు ఇతర అప్లికేషన్ల(application) పనితీరుపై ఇది ఎలాంటి ప్రభావాన్ని చూపదు.

యూట్యూబ్

google history delete all my activity telugu, how to clear google history in telugu, how to delete google search history in telugu, mygoogleactivity, delete google my activity telugu, delete my activity telugu , tips and tricks in telugu, telugu tips, tech tips in telugu, technology tips in telugu, telugu tech tips, technology telugu, telugu tech
delete my activity telugu 

యూట్యూబ్లో(youtube) మీరు వెతికే ప్రతి వీడియో యొక్క ఇన్ఫర్మేషన్(information) కూడా గూగుల్ రికార్డు చేస్తుంది.

ఈ హిస్టరీ(history) కూడా సులభంగా డిలీట్(delete) చేయొచ్చు. ఇందుకు యూట్యూబ్ సెర్చ్ హిస్టరీ ని(youtube search history) క్లిక్ చేయండి.

ఎడమ వైపున "హిస్టరీ"ట్యాబ్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయాలి. ఆ తరువాత "క్లియర్ ఆల్ సెర్చ్ హిస్టరీ(clear search history)", "క్లియర్ వాచ్ హిస్టరీ(clear watch history)" అనే వాటి ఒప్షన్స్ ఎంచుకోవాలి.

లేదా మీరు కోరుకున్న సమాచారాన్ని మాత్రమే డిలీట్ చేయొచ్చు.

వాణిజ్య ప్రకటనలు(Ads, Advertisements)

google history delete all my activity telugu, how to clear google history in telugu, how to delete google search history in telugu, mygoogleactivity, delete google my activity telugu, delete my activity telugu , tips and tricks in telugu, telugu tips, tech tips in telugu, technology tips in telugu, telugu tech tips, technology telugu, telugu tech
delete google my activity telugu

మీరు వెతికే ప్రతి సమాచారాన్ని గూగుల్ తెలుసుకుంటుంది.

అంతేకాదు ఇతర సంస్థలకు అంటే ఫ్లిప్కార్ట్(flipkart) మరియు అమెజాన్(amazon) కి ఈ సమాచారాన్ని అందిస్తుంది.

సో ఇందువల్లే మీ బ్రౌజింగ్ హిస్టరీ(browsing history) ఆధారంగా మీకు ప్రకటనలు(ads) వస్తుంటాయి.

అయితే ప్రకటనల సంస్థలు(advertising agency) మీ సమాచారాన్ని చూడకుండా చేయొచ్చు.

ఇందుకు గూగుల్ అకౌంట్లోకి లాగిన్ అయ్యి. ఆ తరువాత "పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రైవసీ" విభాగంలోకి వెళ్లాలి.

అక్కడ "యాడ్స్ సెట్టింగ్స్ పై ఒక " క్లిక్ చేసి "మేనేజ్ యాడ్స్ సెట్టింగ్స్"ను ఎంచుకోవాలి.

ఇక్కడ "యాడ్స్ పర్సనలైజేషన్" అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. దీన్ని డీ యాక్టివేట్ చేయాలి

అయితే ప్రకటనలు(ads) రాకుండా బ్లాక్(block) చేసే సదుపాయం అనేది లేదు.

గూగుల్ లొకేషన్ (google location)

google history delete all my activity telugu, how to clear google history in telugu, how to delete google search history in telugu, mygoogleactivity, delete google my activity telugu, delete my activity telugu , tips and tricks in telugu, telugu tips, tech tips in telugu, technology tips in telugu, telugu tech tips, technology telugu, telugu tech
google history delete all my activity telugu

ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉండే గూగుల్ మ్యాప్స్లో(google maps) టైం లైన్ అనే ఆప్షన్ ఉంటుంది.

మీరు సందర్శించే ప్రాంతాల సమాచారాన్ని కూడా గూగుల్ ఇందులో రికార్డు చేస్తుంది.

గూగుల్ మ్యాప్స్ టైం లైన్ లింక్ ఓపెన్ చేసి గూగుల్ మ్యాప్స్ హిస్టరీని డిలీట్ చేయొచ్చు.

ఇక్కడ లొకేషన్ ట్రాకింగ్ను(location tracking) కూడా మనం ఆఫ్(off) చేయొచ్చు.

వేస్ట్ బాస్కెట్ బటన్పై క్లిక్ చేసి కోరుకున్న డేటాను డిలీట్ చేసే సదుపాయం కూడా ఉంది.

Share: